బడి ఈడు విద్యార్థి బడిలో చేర్చిన: సి ఆర్ పి మహమ్మద్

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని గోకుల్ తండాకు చెందిన అరవింద్, బడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండడానికి గమనించిన సిఆర్పి మహమ్మద్, అరవిందుకు, విద్యార్థి తల్లికి గురువారం చదువు విలువ, భవిష్యత్తుపై కౌన్సిలింగ్ ఇచ్చి పోసానిపెట్ జిల్లా పరిషత్ పాఠశాలలో, ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి సమక్షంలో 9వ తరగతిలో చేర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, శ్రీనివాస్, నాగభూషణం, గంగమణి తదితరులు పాల్గొన్నారు.