– ఎన్‌పీఆర్‌టీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్
అలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ చేసిన వ్యాఖ్యలకు సీఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో వికలాంగులను అవమానించేలా వారి శక్తి సామర్థ్యలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా భుజంగారెడ్డి మాట్లాడుతూ వికలాంగుల కోటపై ఆమె మాటాలను వెనక్కి తీసుకోవాలని, ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై విమర్శించిన మాటలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చేగురి శేఖర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంతోష, విజయభారతి, మనిలా, సువర్ణ, అంజయ్య అనసూయ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.