సిఎస్ ఈ శిక్షణ తరగతులు విజయవంతం..

– శిక్షణ తీసుకున్నా నర్సులకు సర్టిఫికెట్లు అందజేత..
– ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో వారం రోజులుగా కంటిన్యూయస్ నర్సింగ్ ఎడ్యుకేషన్ (సిఎస్ఈ) నైపుణ్య శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఉస్మానియా సూపరింటెండెంట్  డాక్టర్ నాగేందర్. టీఎన్ ఏఐఅధ్యక్షురాలు యం.రాజేశ్వరి. స్వరాజ్యవాని, ఎక్జిక్యూట్ మెంబర్ చంద్రకళ, నర్సింగ్ సూపరింటెందెంట్ సుజాత రాథోడ్ లు పాల్గొన్నారు. వారం రోజులుగా శిక్షణ పొందిన నర్సులకు సర్టిఫికెట్లను వారు అందజేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో రాణిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ శిక్షణ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని. తన ప్రోత్సాహం సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులు అందర్నీ అభినందించారు. శిక్షణ తీసుకున్న వారు మాట్లాడుతూ.. వారం రోజులుగా నేర్చుకున్న సిఎస్ ఈ శిక్షణ విషయాలను, పద్దతులను కార్యాచరణలో పెడతామని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యతను నర్సింగ్ వృత్తిలో అభివృద్ధి చేసుకోడానికి ఇలాంటి ట్రైనింగ్ తమకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయని నర్సులంతా అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమములో నర్సింగ్ సూపరింటెంట్ సుజాత రాథోడ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీమ్ శిరీష రాన, వనిల్లా, సుజాత, కారోలిన్, హేమలత, సౌమ్యశ్రీ, హరితలు పాల్గొన్నారు.