కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పరామర్శించి సీఎస్ఆర్ 

CSR visited the Congress party worker– అధైర్య పడొద్దు పార్టీ అండగా ఉంటుందని హామీ

 కాంగ్రెస్ పార్టీ  దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండల పరిధిలోని రఘెత్తంపల్లి  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కడుదూరి రాజిరెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుని శుక్రవారం రాజిరెడ్డిని కలిసి  పరామర్శించారు.ఈ సందర్భంగా అధైర్య పడొద్దనీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.