
మిరప పంటలో వచ్చే కుచ్చు బొబ్బెర జెమిని వైరస్ లను కె.బి ఆర్గానిక్స్ తో సమర్థవంతంగా నివారించవచ్చని కేబి సౌత్ ఇండియా హెడ్ ఎస్పీ చారి అన్నారు. శనివారం మండలంలోని చంద్రయ్య పల్లె గ్రామంలో మిరప పంటలొ వచ్చు తెగుళ్లు నివారణ చర్యలు అనే అంశంపై రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎస్పీ చారి మాట్లాడుతూ క్రిమి సమారకాలను వాడి పంటలను, నేలను విషతుల్యం కాకుండా ఆర్గానిక్స్ వినియోగంతో తెగుళ్లను సమర్ధవంతంగా నివారించడమే కాకుండా పర్యావరణానికి ప్రమాదం లేకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నర్సంపేట ఏరియా పరిధిలోని మిరప తోటలో కుచ్చు బొబ్బెర వైరస్ తెగుళ్లు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయని వీటి నివారణకు కేబి ఆర్గానిక్స్ కు చెందిన వైరో రేజ్ లీటర్ నీటికి 2.0 మిల్లీలీటర్లు చొప్పున నోవాజయిమ్ లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్స్ చొప్పున బ్యాలెన్స్ స్టిక్ 0. 4 ఎం ఎల్ చొప్పున అధికంగా ఉంటే రెండుసార్లు సాధారణంగా ఉంటే ఒకసారి తో పిచికారి చేసినట్లయితే ఈ వైరస్ తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చని అన్నారు. అదేవిధంగా మిరప మొక్కలు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందక చనిపోవడం జరుగుతుందని ఈ విల్టు తెగులు నివారణకు రూట్ ఫిట్ ను లీటర్ నీటికి 2 ఎం ఎల్ , బ్యాలెన్స్టిక్ లీటరు నీటికి 0.04 ఎం ఎల్ చెప్తున్న డ్రించిఇన్చేగ్ చేసినట్లయితే మొక్కలు చనిపోవడానికి కూడా నివారించుకోవచ్చని అన్నారు.
ఆర్గానిక్ మందుల వినియోగం వల్ల భూమి సమతుల్యం పెరుగుతుందని తద్వారా మొక్కలు వేపుకు అభివృద్ధి చెందుతాయని దిగుబడును అధికంగా వస్తాయనీ అన్నారు. భూసారం పెంచేందుకు అవసరమైన ఆర్గానిక్ మందుల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా రైతులకు చూపించారు. ఈ కార్యక్రమంలో కెపి ఆర్గానిక్ పూణే డెలిగేట్స్ శివాజీ, రిషికేష్, వరంగల్లు టెరిటరీ టిఎస్ఎమ్ ఏ దేవేందర్, మార్కెటింగ్ డెలిగేట్స్ ఎస్ బుచ్చిరెడ్డి, వీ రమేష్ బి మురళీమోహన్ ఎల్ కళ్యాణ్ పీ కళ్యాణ్ టి సురేష్ సిహెచ్ కృష్ణ ఎల్ నరేష్ లతోపాటు 200 మంది రైతులు పాల్గొన్నారు.