హస్తం గూటికీ క్యూ.?

– సాధారణంగా ఆహ్వానిస్తున్న.. ఎమ్మెల్యే శ్రీదర్ బాబు
– మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న.. కాంగ్రెస్ .. జోష్
నవతెలంగాణ మల్హర్ రావు: ఎస్ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మంథని నియోజకవర్గంలో హస్తం గూటిలో చేరడానికి, బిఆర్ఎస్,బిజేపీ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు,యువత,ముఖ్యంగా మహిళలు సమయం సందర్భం లేకుండా ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు మంథని నియోజకవర్గంలోని మల్హర్, కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, పలిమెల, ముత్తరాం, కమాన్ పూర్ మండలాల్లోని పలు గ్రామాల నుంచి వందలాది మంది క్యూ కడుతున్నారు. వీరికి తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు.

        కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో ఆరు గ్యారంటీలైనా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, యువ వికాసం చేయూత తక్షణమే అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇవే కాకుండా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్ల నిర్మాణం, ఉద్యమ కారులకు, ఉద్యోగాలు, ఇంటి నిర్మాణాలు సైతం మేనిపెస్టో లు చేర్చి అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు. అలాగే మండలంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో రుద్రారం, ఎడ్లపల్లి, తాడిచెర్ల, శభాష్ నగర్ గ్రామాల్లో ఇంటింటా ఆరు గ్యారంటీలు పంపిణీ చేస్తూ శ్రీదర్ బాబుకు ఓటు వేసి గెలిపించాలని విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.