పెద్ది కృషితో పాకాల ఆయకట్టు సస్యశ్యామలం

– గత పాలకుల నిర్లక్ష్యంతోనే నెర్రలు బారిన పాకాల అయకట్టు
– ఆత్మీయ సమావేశంలో యువతకు దిశా నిర్దేశం
– యూత్ కన్వీనర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ-ఖానాపురం
పెద్ది కృషితోనే పాకలయకట్టు సస్యశ్యామలంగా మారి రైతులకు రెండు పంటలకు సరిపడా నీరు అంది పచ్చని పంట పొలాలతో కనివిందు చేస్తున్నాయని యూత్ కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మండలంలో ఏర్పాటుచేసిన యూత్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికై పాటుబడిన పెద్ది సుదర్శన్ రెడ్డిని యువత భారీ మెజారిటీ ఇచ్చి రెండోసారి అధికారం అభివృద్ధి ప్రదాతకు అందించాలని పిలుపునిచ్చారు. గత 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చేయని అభివృద్ధిని పెద్ది సుదర్శన్ రెడ్డి చేసి చూపారని అన్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషించిన పెద్దిని మండల ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని అన్నారు.విలువలతో కూడిన రాజకీయాలకు చిరునామా.. నిస్వార్థ సేవకు ప్రతిరూపమైన తెలంగాణ మలిదశ ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అన్నారు. ప్రజాపాలనే పరమావధిగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందించడంతో రానున్న ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఓట్లతో పెద్దిని సన్మానిస్తారని అన్నారు.నియోజకవర్గ ప్రజలను వదిలి కనీసం రెండు రోజులు కూడా ఉండలేని గొప్ప మనసున్న మహానేత అని కొనియాడారు. ఇటీవల కాలంలో తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతూ, ప్రజల సేవకై జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీని అధికారమిస్తే తెలంగాణ రాష్ట్రం అంధకారమేనని, పచ్చని తెలంగాణను పక్కొళ్లకు అమ్మేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ నేతలదని దుయ్యబట్టారు. నియోజవర్గ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చి నర్సంపేట అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణు కృష్ణ ,సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేష్, ఎన్నికల యూత్ మండల ఇన్చార్జ్ రాధారపు అశోక్, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి గంగాపురం రాజు ,పార్టీ నాయకులు తక్కలపల్లి బాబురావు, ముద్దంగుల రవీందర్,గుగులోతు అశోక్, ముద్దంగుల సంపత్, ఖానాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు మచ్చిక అశోక్ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు గుండ్లపల్లి విజయ్ అన్ని గ్రామాల యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.