నవతెలంగాణ-కోహెడ
మండలంలోని ఆరెపల్లి గ్రామ చంద్రనాయక్ తండా బానోతు కోమలి ఇంటి ఆవరణలో 26 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. బుధవారం చంద్రనాయక్తండాలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన సోదాలలో మహిళ ఇంటి ఆవరణలో 26 గంజాయి మొక్కలతో పాటు 240 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. ఆమె మనుమడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీంతో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ కె.శ్రీధర్, ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపారు. వారివెంట కానిస్టేబుల్, సిబ్బంది ఉన్నారు.