అక్రమంగా నిల్వ ఉంచిన కల్ప పట్టివేత..

నవతెలంగాణ-కుభీర్: మండలంలోని పార్డి కె గ్రామంలో ఒక ఇంటి వెనుక భాగంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను గురువారం బైంసా అటవీ శాఖ అధికారులు పట్టుకోవడం జరిగింది.అటవీ సెక్షన్ అధికారి ఇర్పానోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం పూర్తి సమాచారం మేరకు అటవీ శాఖ సిబ్బందితో కలసి గ్రామంలో సోదాలు నిర్వహిస్తుండగా గ్రామానికి సమీపంలో ఉన్న ఓ ఇంటి వెనుక భాగంలో 30 టేకు దుంగలు లభించడంతో వాటిని స్వాధీన పర్చుకోనట్లు అటవీ శాఖ అధికారులు తెలపరు.వాటి విలువ సుమారు 17500 వరకు ఉంటుందని తెలపరు .గుర్తు తెలియని వ్యక్తులు ప్రాంతాన్ని తరలించినట్లు తెలిపారు.ఈ తనిఖీ లో భాగంగా బిట్ అధికారి లెనిన్ నిర్మల్ టాస్క్ ఫోర్స్ రేంజ్ అధికారి వేణు గోపాల్ అటవీ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు.