రూ. 10 లక్షలతో కల్వర్టు పనులు ప్రారంభం

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని బిజ్జల్ వాడి గ్రామములో  రూపాయలు  పది లక్షల వ్యయంతో  కల్వర్టు నిర్మాణం చేపట్టినట్టు సర్పంచ్ గౌళే యాదవ్ సోమవారం తెలిపారు. ఈ సంధర్భంగా  సర్పంచ్ మాట్లాడుతు ఎసిడిఎఫ్ నిధులతో కల్వర్టు పనులు చేపట్టినట్టు, నాణ్యతగా నిర్మాణం చేయాలని సర్పంచ్ గుత్తేదారునికి తెలిపారు. కల్వర్టు నిర్మాణంతో వర్ష కాలంలోని సమస్యను శాాశ్వత పరిష్కారం జర్గిందని , గ్రామస్తులకు, రైతులకు సుగుమం అవుతుందని పేర్కోన్నారు. సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ , గ్రామ పెద్దలు తదితరులు పాల్గోన్నారు.