కమిన్స్‌ కెప్టెన్సీలోనే..

In the captaincy of Cummins.– చాంపియన్స్‌ ట్రోఫీకి ఆసీస్‌ జట్టు
మెల్‌బోర్న్‌ : 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ విజయ సారథి, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని దశాబ్దం తర్వాత తిరిగి కంగారూలకు అందించిన కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సారథ్యంలోనే ఆస్ట్రేలియా చాంపియన్స్‌ ట్రోఫీ వేట సాగించనుంది. ఫిట్‌నెస్‌ సమస్యలతో చాంపియన్స్‌ ట్రోఫీకి పాట్‌ కమిన్స్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదనే వార్తలొచ్చిన నేపథ్యంలో.. 15 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టును సీఏ సోమవారం ప్రకటించింది. మాట్‌ షార్ట్‌, అరోన్‌ హార్డీలు తొలిసారి ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక కాగా.. నాథన్‌ ఎలిస్‌ జట్టులో చోటు సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గిన జట్టులో డెవిడ్‌ వార్నర్‌ వీడ్కోలు తీసుకోగా.. కామెరూన్‌ గ్రీన్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో దూరమయ్యాడు. మిడిల్‌ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేయటం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌లు సైతం జట్టులో చోటు నిలుపుకున్నారు. ట్రావిశ్‌ హెడ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆసీస్‌ జట్టుకు ఎంపికైన కీలక ఆటగాళ్లు.
ఆస్ట్రేలియా జట్టు : పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), అలెక్స్‌ కేరీ, నాథన్‌ ఎలిస్‌, అరోన్‌ హార్డీ, జోశ్‌ హాజిల్‌వుడ్‌, ట్రావిశ్‌ హెడ్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌, మార్నస్‌ లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాట్‌ షార్ట్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆడం జంపా.