కుతంత్రమే మారెమ్మ మంత్రం..

కుతంత్రమే మారెమ్మ మంత్రం..విష్ణు మంచు నటిస్తూ, నిర్మిస్తున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. ప్రతి సోమవారం ఓ అప్‌డేట్‌ని ప్రేక్షకులకు తెలియజేస్తాం అని మేకర్స్‌ చెప్పినట్టుగా ఈ సోమవారం చిత్ర బృందం ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమా నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్‌ చేశారు.
నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి కంటెంట్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచటం విశేషం. అవా ఎంటర్టైన్మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.