కరెన్సీదే హవా..

కరెన్సీదే హవా..– డిజిటల్‌ కార్డులకు పోటీగా నోట్లు చలామణి
– మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఫెయిల్‌
డిజిటల్‌ కరెన్సీ పెంచితే..కరెన్సీ చలామణి తగ్గిపోతోందంటూ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నోట్ల రద్దు విఫలమైంది. రూ.2000 నోటు వద్దన్నా.. ఆనాడు ఎన్నికల కోసం తెచ్చి..ఇప్పుడు ఆ పెద్ద నోటు వద్దంటూ వెనక్కి తీసేసుకుంది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి..నయా నోటుతో సాధ్యమవుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పుకున్నది. వాస్తవానికి నకిలీ నోట్లు గుజరాత్‌లో ఎక్కువగా పట్టుబడినట్టు కేంద్ర గణాంకాలే ధ్రువీకరించాయి. డిజిటల్‌ కరెన్సీ కన్నా.. మార్కెట్‌లో అనుహ్యంగా నోట్లు వరదలా ప్రవహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన చలామణి అయిన నోట్లు ప్రతినెలా పెరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా..కరెన్సీ తగ్గటంలేదని తాజా నివేదికలే స్పష్టం చేస్తున్నాయి.