– ప్రవహ పోర్టల్ని ప్రారంభించిన ఆర్బీఐ
ఆన్ లైన్ రంగంలో తన సేవల్ని మరింత విస్తరిచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్ని ప్రారంభించింది. మే 28, 2024 అర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ PRAVAH పోర్టల్, రిటైల్ పెట్టుబడి దారులకు ప్రభుత్వ సెక్యూరిటీలలో వ్యాపారం చేయడానికి మొబైల్ యాప్ మరియు ఫిన్‌టెక్ రిపోజిటరీ లాంఛనంగా ప్రారంభించారు. ప్రవహ పోర్టల్ అనేది రిజర్వ్ బ్యాంక్ నుండి అధికారం, లైసెన్స్ లేదా నియంత్రణ ఆమోదం పొందేందుకు వ్యక్తులు లేదా సంస్థలకు సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌ను అందించడానికి రూపొందించిన కేంద్రీకత వెబ్ ఆధారిత పోర్టల్. దీని ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ ఆన్‌లైన్‌లో =దీ× యొక్క వివిధ నియంత్రణ మరియు పర్యవేక్షక విభాగాలను కవర్ చేసే 60 దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించ వచ్చు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు లను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు, వారి స్థితిని పర్యవేక్షించవచ్చు మరియు కాలపరిమితిలో =దీ× నుండి నిర్ణయాన్ని పొందవచ్చు. దీనితో పాటు రిటైల్ పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి =దీ× గవర్నర్ మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు.
మధ్యప్రదేశ్‌లో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్
భారత ప్రభుత్వ యాజమాన్యం అధికారిక సంస్థ అయిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ తన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ని మధ్యప్రదేశ్‌లోని విజయపూర్‌లో ప్రారంభిం చింది. ఈ ప్లాంట్‌ను పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మరియు గెయిల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గుప్తా సంయుక్తంగా ప్రారంభించారు. 2030 నాటికి దేశంలో ఏటా కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన జాతీయ హైడ్రోజన్ మిషన్‌లో భాగం గెయిల్ ఈ ప్లాంట్ ని ఏర్పాటుచేయటం జరిగింది. ఈ ప్లాంట్ లో గ్రీన్-హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్ కోసం 10-మెగావాట్ ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెమ్బ్రేన్ ఎలక్ట్రోలైజర్ కెనడా నుండి దిగుమతి చేయబడింది.
సుల్తాన్ అల్ జాబర్ కి ‘సేరవీక్’ నాయకత్వ పురష్కరం
ఇటీవల జరిగిన జఉూ 28 సదస్సుకి అధ్యక్షత వహించిన డాక్టర్ సుల్తాన్ అల్ జాబర్ కి ఎస్ అండ్ పీ గ్లోబల్ సంస్థ మరియు సేరవీక్ సంయుక్తంగా ఏటా అందించే ‘సేరవీక్’ నాయకత్వ పురష్కరానికి ఎంపిక చేయబడ్డారు. అబుదాబిలో జరిగిన కాప్ సదస్సులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించటంలో అసాధారణ ప్రతిభను కనబర్చినందుకు గాను, భూతాపాన్ని 1.5 డిగ్రీల సెలిసియఎస్ మించ కుండా సుస్థిరమైన ఇంధన వనరులని ఏర్పాటు చేసుకునే దిశగా వివిధ దేశాలు, సంస్థలకి దిశా, నిర్దేశం చేసే విధంగా దేశాల మధ్య అంగీకారం సాధించటంలో విశేషయమైన కషి చేసినందుకు గాను ఆయనకి ఈ పురష్కారం లబించింది.
నిస్సార్ యుద్ధనౌక నిర్మాణం పూర్తి
భారత నౌకా దళం అమ్ముల పొదిలో మరొక యుద్ధనౌక వచ్చి చేరింది. దాదాపు 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ‘నిస్సార్’ యుద్ధనౌక నిర్మాణం పూర్తి అయ్యిందని,ఆ యుద్ధనౌక నిర్మాణ భాద్యతలు చేపట్టిన హిందూస్ధాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) సంస్ధ ఇటీవల ప్రకటిం చింది. నేవీ రంగానికి అవసమైన డ్కెవింగ్ సపొర్టు వెజల్స్ నిర్మాణంలో భాగంగా 1993లో నిస్సార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల దీని పనితీరుగా విజయవంతంగా పరిశీలించిన అనంతరం నిర్మాణ సంస్ధ యుద్ధనౌక నిర్మాణం పూర్తయ్యిందని హెచ్‌ఎస్‌ఎల్ ప్రకటించింది. భారత కొరియా సహాకారంతో ఇంతకు ముందు హిందూస్ధాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) సంస్ధ ఐఎన్‌ఎస్ సుజాత అనే యుద్ధనౌటకను నిర్మించింది.
15 నుండి దక్షిణ భారత్ ఉత్సవ్ 2024
పర్యాటక రంగ అభివద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేం దుకు వీలుగా ఆరు దక్షిణాది రాష్ట్రాలు దక్షిణ్ భారత్ ఉత్సవ్ 2024 పేరుతో ఈనెల 15 నుండి 16 తేదీల్లో ఒక ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో నిర్వహించే ఈ కార్యక్రమంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, పుదుచ్చేరి రాష్రఫ్టాలకు చెందిన వివిధ పర్యాటక సంస్ధల ప్రతినిధులు, సంస్ధలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
భారత ఆర్మీ మేజర్ రాధికా సేన్ కి యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మక 2023 మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత ఆర్మీ మేజర్ రాధికా సేన్‌ను ఎంపిక చేసింది. యుఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఈ అవార్డును మేజర్ రాధికా సేన్‌కు ప్రదానం చేస్తారు. %ఖచీ% శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవాన్ని 2003 నుండి ప్రతి సంవత్సరం మే 29 న జరుపుకుంటారు. 2016లో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల విభాగంలోని సైనిక వ్యవహారాల కార్యాలయం ఈ అవార్డుని ప్రారంబించింది.
పపువా న్యూగినియాకు భారత్ విరాళం
ప్రకతి విపత్తుల వల్ల తీవ్రంగా నష్టపో యిన పపువా న్యూగినియాకి భారతదేశంగా ఉదారంగా ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ప్రకతి విపత్తుల వల్ల పపువా న్యూగినియాలో ఒక గ్రామంలో కొండచరియలు విరిగి పడటం వల్ల సుమారు 2వేల మంది చనిపోయారు, ఈ విపత్కర పరిస్ధితులలో తమకు ప్రపంచ దేశాలు సాయమందించాలని పపువా న్యూగినియా ప్రభుత్వం కోరింది. ఈ అభ్యర్ధనకు ప్రతిస్పందించిన భారత్ 1 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.
డాక్టర్ కె. శశిధర్
పర్యావరణ నిపుణులు
94919 91918