కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsస్వయం సహయక సంఘాల పొదుపులో ఎ.పి. అగ్రస్థానం : ఆంధ్రప్రదేశ్‌ లోని స్వయం సహయక బృందాలు (ఎస్‌.హెచ్‌.జి) లు పొదుపు మరియు క్రెడిట్‌ లింకేజీ రెండింటిలోనూ దేశవ్యాప్తంగా అగ్రస్థానాన్ని సంపాదించి విజయవంతమైన ట్రాక్‌ రికార్డ్‌ను ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా స్వయం సహయక సంఘాల బ్యాంకు లింకేజి కార్యక్రమం, పొదుపు సంఘాల పనితీరుపై నాబార్డు 2022 – 23 వార్షిక నివేదిక సెప్టెంబర్‌ 15న విడుదల చేసింది. దేశంలోని పొదుపు సంఘాలు ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక పొదుపు రికార్డును నెలకొల్పిందని, ఈ విషయంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాలు ముందున్నాయని నివేదిక పేర్కొంది. 2022 – 23 మార్చి నాటికి దేశంలో పొదుపు సంఘాల ద్వారా సేకరించిన మొత్తం పొదుపు 58,892.68 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 18,606.18 కోట్ల పొదుపుతో అగ్రగామిగా నిలబడిందని నివేదిక పేర్కొంది.
ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ నెల 18న ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ప్రముఖ తత్వవేత్త ఆదిశంకరాచార్యలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏక్తమాకి ప్రతిమా (ఏకత్వం యొక్క విగ్రహం) అని పిలువబడే ఈ స్మారక ప్రాజెక్ట్‌కు మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ 2,141 కోట్లకు పైగా గణనీయమైన బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ‘అద్వైత్‌ లోక్‌’ అనే మ్యూజియం మరియు 36 హెక్టార్ల విస్తీర్ణంతో అద్వైత్‌ ఫారెస్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.
కేరళలో మరసారి ‘నిపా’ వైరస్‌ విజృంభణ : దేశంలో మరోసారి నిపా వైరస్‌ విజృంభించింది. నిపా వైరస్‌ సోకి కేరళలో ఇద్దరు మృతి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కేరళలో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తవమయ్యారు. వైరస్‌ కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చారు. 2018, 2021 లో కోజికోడ్‌ జిల్లాలోనే నిపా వైరస్‌ కారణంగా పలువురు మరణించారు. మనదేశంలో మొదటిసారి 2001 లో బెంగాల్‌లోని సిలిగురిలో నిపా వైరస్‌ వెలుగు చూసింది. ఆ తర్వాత 2007లో కేరళ లో కన్పించింది. ఇది ప్రధానంగా మెదడు వాపుకు కారణమవుతుంది. నిపా వైరస్‌ను ఎన్‌.ఐ.వి. అంటారు. ఇది ఒక రకమైన ఆర్‌.ఎన్‌.ఎ. వైరస్‌. ‘కాంపంగ్‌ ఘంగై నిపా’ అనే చోట 1998లో వ్యాపించడంలో ఆ ప్రదదేశం పేరిట నిపా గా పిలుస్తున్నారు.
TIME 100 next 2023 నవ్య సారధుల జాబితాలో హర్‌మన్‌ ప్రీత్‌ : భిన్న రంగాల్లో విశేష కృషి చేస్తూ ప్రపంచ గతినే మార్చే కొత్త తరం సారధుల జాబితా అంటూ ప్రఖ్యాత మ్యాగజైన్‌ ట్రివ్‌ తీసుకొచ్చిన జాబితాలో భారతీయ మహిళ క్రికెటర్‌ హరమన్‌ ప్రీత్‌ స్థానం దక్కించుకున్నారు. 2023 ట్రిమ్‌ 100 నెక్ట్‌ : ది ఎమర్జింగ్‌ లీడర్స్‌ షేపింగ్‌ ది వరల్డ్‌ పేరిట 100 పేర్లలో ఈ జాబితాను సిద్ధం చేశారు. ‘ఆటలో పోటీతత్వం, రగిలిపోయే క్రీడాసక్తితో హర్‌మన్‌ ప్రీత్‌ మహిళా క్రికెట్‌ను ప్రపంచంలో విలువైన క్రీడా ఆస్తిగా మలిచారు” అని టైమ్‌ పొగిడింది.
లిబియా మృతులు 11 వేలు పైనే : లిబియలో డెర్నా లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేలమంది కోసం అన్వేషణ సాగుతుంది. నివాస ప్రాంతాలను తుడిచిపెట్టిన వరద, మట్టి తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తింది.
గోల్డెన్‌ టికెట్‌ అందుకున్న సచిన్‌ : భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ ప్రత్యేక అతిధులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బి.సి.సి.ఐ. వరుసగా ‘గోల్డెన్‌ టికెట్‌’ ఇచ్చి మ్యాచ్‌లకు ఆహ్వానిస్తుంది. ఇటీవలే నటుడు అబితాబ్‌ బచ్చన్‌కు ఈ టికెట్‌ అందించిన బోర్డు కార్యదర్శి జైషా తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’ అందించారు.
SIIMA awards 2023 – ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ : ప్రతిష్టాత్మక సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్‌ 2023 వేడుక దుబారులో ప్రారంభం అయింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటుల సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూకీ అవార్డ్స్‌ (సైమా). గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డులలో ప్రస్తుతం RRR సినిమా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజీలమీద ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రివార్డులను బ్రేక్‌ చేసింది.
ఉత్తమ చిత్రం : సీతారామం
ఉత్తమ దర్శకుడు : ఎస్‌.ఎస్‌.రాజమౌళి (RRR), ఉత్తమ నటుడు – జూనియర్‌ ఎన్టీఆర్‌ (RRR)
ఉత్తమ నటి – శ్రీలీల (దహిక)
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545