కరెంట్‌ అఫైర్స్‌

Current Affairsప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నవంబర్‌ 5
ప్రతి ఏడాది నవంబర్‌ 5న సునామీ అవగాహన కోసం ప్రపంచ అవగా హన దినోత్సవం నిర్వహిస్తారు. సునామీలు, భూకంపాలు, అగ్ని పర్యత విస్పోటనాలు, కొండ చరియలు విరిగి పడటం లాంటి వాటి వల్ల చరిత్రలో లెక్కలేనన్ని ప్రాణాలను కోల్పోయారు. సునామీ అవగాహన దినోత్సవం సునామీకి కారణాలు ప్రభావాలు, తగ్గించే ఉపాయాలు మొదలైన విషయాలపై అవగాహన కల్పిస్తారు. 2023 థీమ్‌ ‘స్థితి స్థాపక భవిష్యత్‌ కోసం అసమానతలతో పోరాటం’.
కోల్‌కతలోని రాజ్‌భవన్‌లో ఉన్న ‘త్రోన్‌రూమ్‌’కు పేరు మార్పు
బ్రిటిష్‌ కాలం నాటి వైభవానికి గుర్తుగా నిలిచే కోల్‌కతాలోని ఇకానిక్‌ ‘సింహాసన గది’కి స్వతంత్ర భారత తొలి ప్రధాని, హోం మంత్రి సర్ధార్‌ వల్లభారు పటేల్‌ పేరు పెట్టడం జరిగింది. పటేల్‌ నెలకొల్పిన ఐక్యత సమగ్రతకు ప్రతీకగా ఈ త్రోన్‌ రూమ్‌కు ఇప్పుడు ‘సర్దార్‌ వల్లబారు పటేల్‌ యూనిటీ రూమ్‌’గా పేరు పెట్టారు.
మిచెల్‌ డగ్లస్‌కు – సత్యజిత్‌ రే అవార్డు
హాలివుడ్‌ నటుడు, నిర్మాత డగ్లస్‌కు సత్యజిత్‌ రే జీవిత సాఫల్య పురస్కారం లభించింది. 54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ పుర స్కారాన్ని అందజేయనున్నారు. కేంద్ర, సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ దీనిపై ప్రకటన చేసారు.
ఎన్నికల నిర్వహణకు ‘ఎన్‌ కోర్‌’ సాఫ్ట్‌వేర్‌
భారత ఎన్నికల సంఘం ‘ఎన్‌కోర్‌’ పేరు తో ఒక అంతర్గత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ రియన్‌ టైమ్‌ ఎన్వి రాన్‌మెంట్‌పై కమ్యూనికేషన్‌ను ప్రారం భించనుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ఎన్నికల సమయంలో కార్యకలా పాలు సజావుగా జరగడం కోసం అనేక రకాల పేచర్లను అంది స్తుంది. ఎన్‌కోర్‌ సాఫ్ట్‌వేర్‌ రిటర్నింగ్‌ అధికారులకు వివిధ రకాల ఎన్నికల విధులను నిర్వర్తించడానికి, అభ్యర్ధి నామినేషన్‌ నుంచి ఓటర్‌ ట్రాకింగ్‌ ఓట్ల లెక్కింపు, ఫలితాలు, డేటా నిర్వహణ వరకు సమగ్ర వేదికను అందించనుంది.
డార్క్‌ వెబ్‌లో 81.5 కోట్ల భారతీయుల వివరాలు లీక్‌
81.5 కోట్ల భారతీయుల వివరాలు డార్క్‌ వెబ్‌లో లీక్‌ అయి నట్లు అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ”రీ సెక్యూ రిటీ” వెల్లడించింది. లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్‌ నెంబర్‌, మొబైల్‌ నెంబర్స్‌ వంటివి ఉన్నట్టు సమాచారం. అక్టోబర్‌ 9న ూఔచీఉఉూ పేరుతో ఒక హ్యాకర్‌ 8:15 కోట్ల భారతీ యుల ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్ట్‌ రికార్డ్స్‌ యాక్సెస్‌ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలు 8000 డాలర్లకు విక్రయించడానికి సిద్దమయినట్లు సమాచారం. దీని వల్ల బ్యాంకింగ్‌ దోపిడీలు, టాక్స్‌ రిఫండ్‌ మోసాలు, ఇతర ఆర్ధిక నేరాలకు పాల్పడే అవకాశం వుంది.
Chang maker of the year
అంతర్జాతీయ క్లిష్ట పరిస్థితులలో భారత్‌ ఆర్ధిక పటిష్టతకు తన వంతు కృషి చేస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతిష్టాత్మక ‘చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ను గెలుచుకుంది. ది హిందు బిజినెస్‌ లైన్‌ చేంజ్‌ మేకర్‌ అవార్డు 2023కు సంబంధించి గవర్నర్‌ శిక్తకాంత్‌దాస్‌ నేతృత్వంలోని ఆర్‌బిఐ ఈ గుర్తింపు పొందినట్లు ఒక ప్రకటన వెలువడింది. డెయిరీ సంస్థ అమూల్‌కు ‘ఇకానిక్‌ చేంజ్‌ మేకర్‌’ గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజనకు ‘చేంజ్‌ మేకర్‌ – ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌పర్మేషన్‌’ అవార్డు పొందింది.
పాకిస్తాన్‌లో మెదడును తినే అమీబా
పాకిస్తాన్‌ కొత్త సమస్యను ఎదుర్కొంటుంది. పలు రాష్ట్రాలలో మెదడును తినే అమీబా బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘నెగ్లేరియా ఫౌకెరి’ అని పిలిచే ఈ ఏక కణజీవి సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌లో గల రెండు వారాలలో ఈ అమీబా కారణంగా ముగ్గురు మరణిం చారు. ఇది అరుదైన ప్రాణాం తక అమీబా అని ఇది మంచి నీటి వనరులలో అభివృద్ధి చెందుతుందని, క్లోరినేషన్‌ చేయని కొలనులలో ఈతకు దూరంగా వుండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఇది కొలనులు, నదులు, కాలువలు చెరువుల్లో వుంటుంది. ముక్కు నోరు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడును తినేస్తుంది. 2018 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 381 మంది దీని మూలంగా మరణించారు.
రెడ్‌ లైట్‌ ఆన్‌ వెహికిల్‌ ఆఫ్‌
ఢిల్లీలో ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా × ుఉ కూడలిలో ”రెడ్‌ లైట్‌ ఆన్‌ – వెహికిల్‌ ఆఫ్‌” అనే ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం 70 అసెంబ్లి నియోజక వర్గాల్లో ఈ ప్రచారం కొన సాగింది. 2020లో దీనిని ప్రారంభించారు.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545