జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహం
ప్రపంచకప్‌లో భారత్ సెమీ ఫైనల్ విజయం, వన్డే క్రికేట్‌లో విరాట్ కోహ్లీ 50 సెంచరీలు పూర్తి చేసుకొన్న సందర్భంగా జైపూర్‌లోని నహార్ గడ్ కోటలోని మైనపు మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఎక్సర్‌సైజ్ మిత్రశక్తి – 2023
ఎక్సర్ సైజ్ మిత్రశక్తి అని పిలవబడే జాయింట్ మిలటరీ ఎక్సర్ సైజ్ నవంబర్ 16 నుంచి 29 వరకు పూణేలో ప్రారంభమ య్యింది. భారత్, శ్రీలంక సైనిక దళాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం దాని లక్ష్యం.
స్పెయిన్ ప్రధానిగా పెడ్రో శాంచెజ్
స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంబెజ్ 2వ సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 29, 1972న జన్మించిన పెడ్రో శాంచెజ్ స్పానిష్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. అతను జూన్ 2018లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఏపీ హైకోర్టు ఏఎస్‌జీగా నరసింహ శర్మ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏస్‌జీ)గా బి.నరసింహ శర్మ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణా హైకోర్టులో ఏఎస్‌జీగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహ శర్మకి అధనంగా ఆంధ్రప్రదేశ్‌కి ఏఎస్‌జీగా కూడా బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 4640 కోట్ల పెట్టుబడి పెట్టనున్న పెప్పర్ మోషన్ సంస్థ
జర్మనికి చెందిన పెప్పర్ మోషన్ అనే సంస్థ 4640 కోట్లతో తయారీ యూనిట్‌ను నెలకొల్పను న్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800ఎకరాలు ఈ సంస్థకు కేటా యించింది. ఈ పరిశ్రమలో విద్యుత్ బస్సులు, ట్రక్‌లు, 20జీడబ్లూహెచ్ బ్యాటరీలు తయారు చేయనున్నారు. దీని ద్వారా 8000కు పైగా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. 2025 నాటికి సంస్థలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు.
ఒకే వన్డే క్రికెట్‌లో 7 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ షమీ
వన్డే భారత్ బౌలర్‌గా మహ్మద్ షమీ క్రికెట్ చరిత్రలో తన పేరును నిలబెట్టుకున్నారు. ఇటీవల ముంబైలో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ 6/4 రికార్డు కల్గివున్న స్టువర్ట్ బిన్నీ రికార్డును షమీ అధిగమించారు.
– కె. నాగార్జున
కరెంట్ ఎఫైర్స్ సీనియర్ ఫ్యాకల్టీ
9490352545