కరెంట్‌ అఫైర్స్‌

కరెంట్‌ అఫైర్స్‌లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక
రాజస్థాన్‌ కోటా నుండి బీజేపీ అభ్యర్ధిగా గెలిచిన ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. దాదాపు 48 ఏండ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన వరుసగా రెండవసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఓం బిర్లా అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు మూజువాణీ ఓటుతో మద్దతు పలికారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తమ స్పీకర్‌ అభ్యర్ధిగా కేరళకు చెందిన ఎంపి కొడికున్నిల్‌ సురేష్‌ను నిలబెట్టటంతో పోటీ అనివార్యమయ్యింది. మాడభాషి అనంతశయనం అయ్యంగార్‌, గుర్డియాల్‌సింగ్‌ థిల్లాన్‌, బలరాం జాఖడ్‌, జిఎంసి బాలయోగిల తర్వాత రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టిన జాబితాలో ఓం బిర్లా చేరారు. దానితో పాటు తొలివిడతలో పూర్తిగా ఐదేండ్లు స్పీకర్‌గా పని చేసి, వరుసగా రెండవసారి స్పీకర్‌ పదవి చేపట్టిన తొలివ్యక్తి బలరాం జాఖడ్‌ కాగా, ఓం బిర్లా రెండో వ్యక్తిగా రికార్డు సష్టించారు.
నాటో సెక్రటరీ జనరల్‌గా మార్క్‌ రుట్టే
ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమిగా పేరు పొందిన ‘నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటి ఆర్గనైజేషన్‌’ (నాటో)కి నూతన సెక్రటరీ జనరల్‌గా డచ్‌ ప్రధానమంత్రి మార్క్‌ రుట్టే నియమితులయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో అమెరికా చొరవతో నాటో ఏర్పాటు చేయబడినది. ప్రస్తుతం సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జెన్స్‌ స్టాల్టెన్‌బర్గ్‌ పదవీ కాలం ముగిసిన అనంతరం అక్టోబర్‌ 1న రుట్టే భాద్యతలు స్వీకరించనున్నారు. ఒక పక్క ఉక్రెయిన్‌ యుద్ధం, ఐరోపా దేశాలలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న తరుణంలో మార్క్‌ రుట్టే నాటో సెక్రటరీ జనరల్‌గా నియమితులు కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎఐకి కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌
కత్రిమ మేధ రంగంలో విస్తతంగా పరిశోధనలు చేస్తూ అడ్వాన్స్‌డ్‌ ఎఐ సిస్టమ్స్‌తో రూపొందిస్తున్న సంస్ధలను కట్టడి చేయడానికి కొన్ని విధివిధానాలకు రూపకల్పన చేయాలని జీ 7 దేశాలు ఇటీవల ఇటలీలో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో నిర్ణయం తీసుకున్నాయి. రానున్న రోజుల్లో ఎఐ టెక్నాలజీ ద్వారా పొంచి ఉన్న ముప్పు కట్టడి చేసే దిశగా ఎఐ సాంకేతికతకు రూపకల్పన చేస్తున్న సంస్థలకు కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ (ప్రవర్తనా నియమావళి)ని జీ 7 దేశాలు రూపొందించాయి. కత్రిమమేథ సష్టించే సమస్యలను ఎదుర్కొంటూ, దాని ప్రయోజనాలను మాత్రమే అందిపుచ్చుకునేలా ప్రపంచ దేశాలకు చెందిన ఎఐ సాంకేతిక సంస్థలు కషి చేయాలని ఈ సదస్సు ద్వారా జీ 7 దేశాలు పిలుపునిచ్చాయి. దీంతో పాటు అభివద్ధి చెందుతున్న దేశాలలో మౌళిక సదుపాయాల అభివద్ధికి ప్రారంభించిన ‘పార్టనర్‌షిప్‌ ఫర్‌ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్టమెంట్‌ ద్వారా 2027 నాటికి 600 బిలియన్‌ డాలర్ల నిధిని సమీకరించాలని నిర్ణయం తీసుకున్నాయి.
సాక్షిమాలిక్‌కు అరుదైన గౌరవం
ప్రతిష్టాత్మకమైన ట్కెమ్‌ మ్యాగజైన్‌ 2024 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత మహిళా రెజ్లర్‌ సాక్షిమాలిక్‌ స్థానం పొందారు. మహిళా రెజర్లను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌పై సాక్షి మాలిక్‌ జరిపిన పోరాటానికి ఈ అరుదైన గౌరవం లభించింది. 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కాంస్యం సాధించి సాక్షి రికార్డు సష్టించింది. ఈ జాబితాలో సాక్షి మాలిక్‌తో పాటు మరొక ఏడుగురు భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారికి చోటు లభించింది. ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజరు బంగా, మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, నటుడు, దర్శకుడు దేవ్‌ పటేల్‌, అమెరికా ఇంధన రవాణా కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్‌ జిగర్‌ షా, యేల్‌ విశ్వవిద్యాలయ ఖగోళ, భౌతికశాస్త్రాల ఆచార్యుడు ప్రియావేరా నటరాజన్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన రెస్టారెంట్‌ యజమాని అమ్మిఖాన్‌ ఉన్నారు.
విజయవంతమైన పుష్పక్‌ ప్రయోగం
పునర్‌ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌) పుష్పక్‌ను ఇస్రో వరుసగా మూడవ సారి విజయవంతంగా ప్రయోగిం చింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెర తాలుకాలోని నాయకన హట్టిలో గల డిఆర్‌డిఒ ప్రాంగణంలో ఈ పరీక్ష నిర్వహించారు. అనంతరం పుష్పక్‌ వాహానం యొక్క సామర్ధ్యాన్ని దశల వారీగా పరీక్షించటం జరిగిందని, ఆఖరిగా నిర్వహించిన అంతిమ సన్నాహక ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని ఇస్రో అధికారులు ఇటీవల ప్రకటించారు.
బజరంగ్‌పై వేటు
భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పునియాపై మరొక్కసారి వేటు పడిరది. జాతీయ టోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) రెండోసారి పునియాని సస్పెండ్‌ చేసింది. ఈ ఏడాది మార్చి 10వ తేదిన సోన్‌పట్‌లో జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌ పునియా నిషేధిత ఉత్రేరకాలు తీసుకున్నాడని ఆరోప ణలు వచ్చాయి. ఈ ఆరోపణపై నిజానిజాలు తేల్చడానికి యూరిన్‌ నమూనాలు ఇవ్వాలని నాడా కోరింది. దీనికి పునియా నిరాకరించటంతో నాడా మొదటిసారి అతనిపై వేటు వేసింది. తనపై నాడా విధించిన సస్పెన్షన్‌ ఎత్తి వేయాలని అతను యాంటీ డిసిప్లినరీ డోపింగ్‌ ప్యానెల్‌ (ఎడిడిపి)ని ఆశ్రయించాడు. కొన్ని టెక్నికల్‌ వంటి అంశాల ఆధారంగా ఎడిడిపి పునియాపై నిషేదాన్ని ఎత్తి వేసింది. కాగా రెండవసారి పునియాకి నోటీసు ఇచ్చి, మరొక సారి వేటు వేసింది.
ఎన్‌టిఎ డైరక్టర్‌పై వేటు
దేశంలో పెను దుమారం రేపిన నీట్‌, యుజిసి నెట్‌ పరీక్షలలో జరిగిన అవకతవకలపైన కేంద్ర దష్టి సారించింది. దిద్దుబాటు చర్యలలో భాగంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) డైరక్టర్‌ జనరల్‌ పై వేటు వేసింది. ఇప్పటి వరకూ డైరక్టర్‌గా ఉన్న సుబోద్‌ కుమార్‌ను తొలగించి, అతని స్థానంలో భారత వాణిజ్య ప్రోత్సాహాక సంస్థ (ఐపిటిఒ) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ ఐఎఎస్‌ అధికారి ప్రదీప్‌ సింగ్‌ ఖరోరాను నియమించింది. దీంతో పాటు ఇక నుండి నీట్‌, నెట్‌తో సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకెజ్‌ కేసులలో దోషులుగా తెలితే 10 సంవత్సరాలు జైలుశిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది. ఇక మీదట ఎవరైనా పేపర్‌ లీకేజీ వంటి నేరాలకు పాల్పడితే ‘ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం 2024 కింద శిక్షార్హులవుతారని పేర్కొంది. ఈ నెల 21వ తేది నుండి దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి వచ్చిందని కేంద్రం ప్రకటించింది.
పరీక్షల సంస్కరణలపై కమిటీ
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షలను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి తీసుకురావల్సిన సంస్కరణలపై అధ్యయనం చేయడానికి ఇస్రో మాజీ చైర్మన్‌ కె. రాధాకష్ణన్‌ ఆధ్వర్యంలో కేంద్రం ఒక ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షల నిర్వాహణ, డేటా భద్రతకు తీసుకోవాల్సి చర్యలు, ఎన్‌టిఎ నిర్మాణం పరంగా తీసుకోవాల్సిన చర్యలు, అన్నింటి కన్నా ముఖ్యంగా ఎన్‌టిఎ పనితీరును మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి తీసుకోవల్సిన చర్యల వంటి అంశాలపై అధ్యయనం చేసి, రెండు నెలల్లో తీసుకురావల్సిన సంస్కరణలతో ఒక నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.
జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్‌
జిఎస్‌టి పరిధిలోకి పెట్రోల్‌ను తీసుకు రావాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలకు స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా ఇటీవల నిర్మలా సీతారామన్‌ నేతత్వంలో జరిగిన 53వ జిఎస్‌టి సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉక్కు, ఇనుము, అల్యూమినియంల మిల్క్‌ కేన్‌లపై 12 శాతం జిఎస్‌టిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను ఒకేరీతిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్యాకింగ్‌కు ఉపయోగించే కార్బన్‌ బాక్సులపైన కూడా 12 శాతం జిఎస్‌టిని అమలు చేయనున్నారు. దీంతో హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లోని ఆపిల్‌ పండించే రైతులకి మేలు జరిగే అవకాశం కలగనుంది. పెట్రోల్‌ని జిఎస్‌టి పరిధిలోనికి తీసుకురావటంపై రాష్ట్రాలు తన వైఖరిని తెలియచేయాలని మంత్రి సీతారామన్‌ ఆయా రాష్ట్రాలను కోరారు.
డాక్టర్‌ కె. శశిధర్‌
పర్యావరణ నిపుణులు
94919 91918