కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs‘గ్రేవ్‌యార్డ్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ అంటే ఏమిటి?
ఇజ్రాయిల్‌..గాజాలో భూతల దాడులు ముమ్మరం చేసింది. వైమానిక వేగం పెంచింది. హమాస్‌ ఉగ్రవాదులను పూర్తిగా ఏరిపారేసే వరకు యుద్ధం ఆగదని తేల్చి చెబుతోంది. గాజాని జల్లెడ పట్టి, శత్రువు అనే వాడు లేకుండా చేస్తానంటోంది. గాజాలో అమాయకులు ఉసురు తీయడంలో ఇజ్రాయిల్‌ సేనలు చెలరేగిపోతున్నాయి. ఇజ్రాయిల్‌ దాడుల్లో ప్రతి రోజు 420 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘గ్రేవ్‌యార్ట్‌ ఫర్‌ చిల్డ్రన్‌’..ఇది గాజాలో కొనసాగుతోన్న మారణహౌమాన్ని చూసి, ఆ ప్రాంతానికి యూనిసెఫ్‌ పెట్టిన పేరు. తెలుగులో దీని అర్థం చిన్నారుల శశ్మాన వాటిక. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఎక్కువగా బలైపోతున్నది అమాయక పౌరులే. వారిలోనూ చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గాజాలో ఇజ్రాయిల్‌ నిరంతరం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా పాలుతాగే చిన్నారులు సైతం నెత్తుటి ముద్దలుగా మారిపోతున్నారు.
ఆకలి సూచీలో భారత్‌కు 107వ స్థానం
భారత్‌లో ఆకలి కేకలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో మన దేశం ఆరు స్థానాలు పడిపోయింది. 101 నుంచి 107కు దిగజారిపోయింది. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ కంటే మనం వెనుకబడి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 121 స్థానాలకుగాను భారత్‌ 107 స్థానంలో ఉన్నట్టుగా 2022 సంవత్సరానికి గాను గ్లోబల్‌ హంకర్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. చైల్డ్‌ వేస్టింగ్‌ రేటులో (పోషకాహార లోపంలో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం) 19.3 శాతంతో ప్రపంచంలోనే భారతన తొలి స్థానంలో ఉంది. ఐరిష్‌ సహాయ సంస్థ కన్సర్న్‌ వరల్డ్‌వైడ్‌, జర్మనీకి చెందిన వెల్ట్‌ హంగర్‌ హిల్ఫ్‌ ఈ ఆకలి సూచి నివేదికని రూపొందించి.
ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమల్లో పెరిగిన ఉత్పత్తి శాతం
2023-24 ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం ఉత్పత్తి పెరగడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ పరిశ్రమల్లో ఉత్పత్తి 5.8 శాతం పెరిగినట్లు ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) డేటా వెల్లడించింది. ఒక్క మార్చి నెలలోనే ఏకంగా 4.9 శాతం ఉత్పత్తి పెరిగిందని… గతేడాది అదే సమయానికి కేవలం 1.9 శాతంగానే ఉత్పత్తి జరిగినట్లు తేలింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5.2 శాతం ఉత్పత్తి జరగ్గా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం ఉత్పత్తి పెరగడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మైనింగ్‌ ఉత్పత్తులు 1.2 శాతం, విద్యుత్తు ఉత్పత్తులు 8.6 శాతం పెరిగాయి. ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ప్రొడక్షన్‌ (ఐఐపీ)లో గత ఆర్థిక సంవత్సరంలో 5.2 వృద్ధి శాతం నమోదు చేయగా.. 2023-24లో అత్యధికంగా 5.8 వృద్ధి నమోదైంది.
ఆగ్రాలో మరో తాజ్‌ మహల్‌.. రాధాస్వామి సత్సంగ్‌ భవనం
అగ్రా అంటేనే తాజ్‌ మహల్‌ అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడే మరో అద్భుతమైన పాలరాతి భవనం ఉందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భవనం తాజ్‌ మహల్‌కు పోటీనిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాధాస్వామి సత్సంగ్‌ శాఖ వ్యవస్థాపకుడు పరమ పురుష్‌ పూరన్‌ ధని స్వామిజీ సమాధి స్థలంపై నిర్మించబడిన ఈ భవనం, స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో నిర్మితమై, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజ్‌ మహల్‌ నుంచి 12.కి.మీ దూరంలో ఉన్న స్వామి బాగ్‌లో ఈ భవనం ఉండడం వల్ల దీన్ని రెండో తాజ్‌ మహల్‌ అని కూడా పిలుస్తున్నారు. 193 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవనం రాజస్థాన్‌లోని మక్రానా నుంచి తెచ్చిన తెల్లని పాలరాతితో నిర్మించబడింది.