భారత్, ఉజ్జెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం
భారత్, ఉజ్జెకిస్తాన్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT)పై సెప్టెంబర్ 27వ తేదీన సంతకం చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందంపై భారత ఆర్థికమంత్రి నిర్మిల సీతారామన, ఉజ్జెకిస్తాన్ ఉపప్రధాని ఖోజాయెన్ జమ్షిద్ అబ్దుఖాకిమోవిచ్ తాష్కెంట్‌లో సంతకం చేశారు. ఒప్పంద నిబంధనల ప్రకారం పెట్టుబడులు వసూలు (expropriation) నుంచి రక్షణ పొందుతాయి. ఈ ఒప్పందం పెట్టుబడి కార్యకలాపాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించడానికి, నష్టాలకు పరిహారం విధానాలను నిర్దేశించడానికి దోహదం చేస్తుంది. పెట్టుబడులను రక్షించడం ద్వారా, ఒప్పందం రాష్ట్రానికి నియమించుకునే హక్కులను కాపాడుతుంది. అందువల్ల కరెక్ట్ విధానాలకు అవకాశం కల్పిస్తుంది.
దీపక్ మెహతాకు ఐసీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
దీపక్ నైట్రైట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ సి.మెహతా ఇటీవల 59వ ఇండియన్ కెమికల్ కౌన్సిల్ (ICC`) వార్షిక అవార్డుల కార్యక్రమంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. దీపక్ మెహతా రసాయన పరిశ్రమలో ఒక విప్లవాత్మక నాయకుడిగా గుర్తించబడ్డారు. ఆయన మాజీ ఇండియన్ కెమికల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, భారత ప్రభుత్వ రసాయన పరిశ్రమ టాస్క్ ఫోర్స్‌లో ముఖ్య సభ్యుడిగా, భారత దేశాన్ని ప్రపంచ రసాయన తయారీ శక్తిగా మారుస్తున్న ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఫిక్కీలో నేషనల్ కెమికల్స్ కమిటీ, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నారు. ఇది ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన అంకితభావాన్ని చూపిస్తుంది.
రొబోటిక్ మ్యూల్స్‌ను ప్రవేశపెట్టిన భారత సైన్యం…
భారతసైన్యం ఇటీవల తన ఆర్థిక, ఆపరేషనల్ సామర్థ్యాలను పెంచేందుకు రొబోటిక్ మ్యూల్స్‌ను ప్రవేశపెట్టింది. రొబోటిక్ మ్యూల్ అనేది కుక్క ఆకారంలో రూపొందించిన రొబోట్, ఇది కఠినమైన భూముల్లో పర్యవేక్షణ, తేలికపాటి బరువులను రవాణా చేయడానికి సహాయపడుతుంది. 100 రొబోటిక్ మల్టీ-యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్ (వీఖూజు) లను ముందుడుగు (యుద్ధ) ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలలో వినయోగానికి భారత సైన్యం ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ రోబోట్లు మెట్లు, వాలు కొండలు ఎక్కి, -40 నుంచి +55 డిగ్రీల సెల్సియస్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలలో పని చేయగలవు. అలాగే 15కేజీల బరువును మోయగలవు. అదే విధంగా ఎత్తయిన ప్రాంతాలలో మద్దుతు, రవాణాను మెరుగుపరచడానికి లాజిస్టిక్స్ డ్రోన్‌లు పరీక్షించబడుతున్నాయి. రోబోటిక్ ముల్ అన్ని రకాల వాతావరణాలకు రూపొందించబడిన ఒక మన్నికైన, చురుకైన భూమి రోబోట్, వస్తువులను గుర్తించడానికి ఎలక్ట్రో-ఆప్టిక్స్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది. ఇది నదుల గుండా, లోపల కదిలే సామర్థ్యం కలిగి ఉంటుంది.
చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం
ఒక్కసారే దాదాపు 10 అణ్వాయుధ వార్‌హెడ్‌లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీఎం)ని చైనా విజయవంతంగా పరీక్షించింది. హైనన్ ద్వీపం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు 12వేల కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోకి పడినట్లు తెలుసుస్తోంది. ఇది డీఎషన-31 లేదా డీఎఫ్-41 రకానికి చెందినది కావొచ్చని భావిస్తున్నారు. దీనికి 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రస్తుత క్షిపణి అమెరికాలోని ప్రధాన నగరాలను సునాయాసంగా ఢకొీట్టగలదు. నలువైపుల నుండి రక్షణ కల్పించేలా తేలికపాటి తూటా రక్షణ కవచాలను (బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను) ఐఐటీ-ఢిల్లీతో కలిసి ‘రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ’ (డీఆర్‌డీవో) తీర్చిదిద్దింది. 360 డిగ్రీల కోణంలో ఎటు నుంచి ముప్పు ఎదురైనా ఇది అడ్డుకుంటుందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సాంకేతికతను మన దేశంలోని కొన్ని పరిశ్రమలకు బదలాయిస్తారు. వీటికి ‘అభేద్’ (అడ్వాన్స్‌డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్) అని పేరు పెట్టారు. వివిధ బీఐఎన్ ప్రమాణాల మేరకు వీటిని 8.2 కేజీలు, 9.9 కేజీల కనీస బరువుతో రూపొందించారు. పాలిమర్లు, దేశీయ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థాలు ఉపయోగించి ఈ జాకెట్లను తయారు చేశారు.