– ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా బీడీ కార్మికుల వినతి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఫిబ్రవరి 28, 2014 కటాఫ్ తేదీని తొలగించి చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4016 అందించాలని కోరుతూ బీడీ కార్మికులు తాసిల్దార్ ఆంజనేయులు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పిడి కంపెనీలో అనేక సంవత్సరాలుగా బీడీ కార్మికురాలుగా పనిచేస్తున్నామని, నిజాంబాద్ జిల్లాల గల అన్ని బీడీ ఫ్యాక్టరీలలో నెలకు ఐదు రోజుల నుండి పది రోజుల వరకు, మేము పని చేసే అంత కాకుండా సగానికి సగం తగ్గించి ఇస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం మీకు తెలిసిందేనని, బీడీలు చేసే పనికి వచ్చే కూలి నామమాత్రంగానే మిగులుతుందని.. మా కుటుంబాలు దినదిన ఘనంగా గడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి పెంచడానికి కార్మికులకు చేతినిండా పని ఇవ్వాలని అనేక ఆందోళన చేసిన ఫలితం మాత్రం శూన్యమని పేర్కొన్నారు. బీడీ ఫ్యాక్టరీ యజమానులు వారి స్వలాభం కొరకు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు బీడీ కార్మికులకు నెలకు రూ.4016 చేయూత పథకం ద్వారా ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఫిబ్రవరి 28, 2014 కటాఫ్ తేదీని తొలగించి ఈ రంగంలో పని చేస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బట్టి వాలా, గంప వాలా, ప్యాకింగ్, కమిషన్ దారులకు, జాతీయ కంపెనీలు పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత పథకం ద్వారా 4016 మృతి అందించాలని కోరారు. కార్మికులంతా వ్యక్తిగతంగా తమ వినతి పత్రాలను తహసిల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి అందజేశారు.