డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహకాలకు కోత

Cut to incentives for digital paymentsన్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు కేంద్రం కోత పెట్టింది. రూపే డెబిట్‌ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్‌ 2024-25లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గించింది. ఇంతక్రితం ఫిబ్రవరిలోని మధ్యంతర బడ్జెట్‌లో రూ.3,500 కోట్లను ప్రతిపాదించగా.. తాజాగా సగానికి పైగా కోత పెట్టడం గమనార్హం. 2023-24 బడ్జెట్‌లో రూ.2,485 కోట్లను కేటాయించింది. మధ్యంతర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భారీగా పెంచి.. తాజాగా తగ్గిచడంతో ఫిన్‌టెక్‌, బ్యాంకింగ్‌ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపనుం దని ఆ రంగం నిపుణులు భావిస్తున్నారు. గడిచిన జూన్‌ మాసంలో దేశంలో 1380 కోట్ల యుపిఐ లావాదేవీలు నమోదయ్యాయి. విలువ పరంగా మేలో రూ.20.45 లక్షల కోట్ల లావాదేవీలు జరగ్గా.. జూన్‌లో రూ.20.07 లక్షల కోట్లకు తగ్గాయి.