క్యూట్‌గా.. స్వీట్‌గా..

ఎన్‌ ఆర్‌ ఐ ఎంటర్టైన్మెంట్స్‌ (యు ఎస్‌ ఎ) సమర్పణలో న్యూ రీల్‌ ఇండియా ఎంటర్టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్‌ హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత, దర్శకుడు. కళ్యాణి మాలిక్‌ సంగీతం అందించగా కెకెఆర్‌, బాల రాజ్‌ సంయుక్తంగా ఈ రొమాంటిక్‌ కామెడీని నిర్మించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్‌ స్వరపరిచిన రెండు రొమాంటిక్‌ మెలోడీ పాటలు విడుదలై సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను హీరో అడివి శేష్‌ రిలీజ్‌ చేశారు. దర్శకుడు బాల స్నేహితుడైన అడివిశేష్‌ గూఢచారి 2, డెకాయిట్‌ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ శనివారం అన్నపూర్ణ 7 ఎకరాల ప్రాంగణంలో ఈ చిత్రంలోని మూడో పాటను వీక్షించి, రిలీజ్‌ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘క్యూట్‌గా, స్వీట్‌గా పాట సాహిత్యం చాలా బాగుంది. పాట మాదిరిగానే చిత్రం మంచి విజయం సాధించాలి’ అని అన్నారు.
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ, ‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ క్యూట్‌గా స్వీట్‌గా అనే అందమైన పాటను విడుదల చేసిన అడివి శేష్‌కి నా కతజ్ఞతలు. మా చిత్రం మంచి మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్‌కి థ్యాంక్స్‌. ఈ క్యూట్‌గా స్వీట్‌గా పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్‌ అందించగా బాహుబలి ఫేమ్‌ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్రాన్ని ఈ సమ్మర్‌లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు.