హైదరాబాద్ : నగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించినట్లు యుఎఇ కేంద్రంగా పని చేస్తోన్న క్యూటిస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. భారత్‌లో ఇది తమకు ఎనిమిదవ క్లినిక్ అని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్ డాక్టర్ షాజీర్ మాచించేరీ తెలిపారు. ఈ క్లినిక్‌ను డిసిపి ట్రాపిక్ రాహుల్ హెగ్డే, నటీ తేజా, షాజీర్ ప్రారంభించారు. అధునాతన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, కాస్మెటిక్ ట్రీట్‌మెంట్లలో తమ సంస్థ అంతర్జాతీయ స్థాయి సేవలను అందిస్తుందని షాజీర్ పేర్కొన్నారు. ఈ యూనిట్ తమ వృద్ధిలో పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ విస్తరణ ప్రణాళికలను సిఇఒ కె జయన్ వెల్లడించారు.