నవతెలంగాణ – కామారెడ్డి
2014 సంవత్సర కటాఫ్ చేతిని తొలగించి ఎలాంటి షరతు లు లేకుండా బీడీ పరిశ్రమ లో పనిచేయు కార్మికులందరికీ రూ.4016 జీవన భృతి ఇవ్వాలని, బి ఎల్ టి యు, శ్రామిక శక్తి పీడి వర్కర్స్ యూనియన్, మచరెడ్డి మండల కేంద్రంలో బారీ ర్యాలి నిర్వహించి ఎంపిడిఓ కార్యాలయం ముట్టడించారు. శనివారం కామారెడ్డి జిల్లా మచరెడ్డి మండల కేంద్రం బస్టాండ్ నుండి, బీడీ కార్మికులతో ర్యాలి,యం,పీ,డి,ఓ,ఆఫీసు ముట్టడి అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్, ఎఐఎఫ్ టీయూ, ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికుల అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2014, పిబ్రవరి 28 తేదీ కటాఫ్ తేదీని తొలగించి, 2016లో జీవన భృతిని రూ. 4016లకు పెంచి ఇవ్వాలని మచరెడ్డి మండల కేంద్రం లో భారీ ర్యాలి, యం,పిడీఓ,ఆఫీసు ముట్టడి చేసి, ఇన్చార్జి ఎంపీడీఓ నాగరాజు కు వినతిపత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు యస్. సిద్దిరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. ఆంజనేయులు రాష్ట్ర నాయకులు నగరపు యెల్లయ్య, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ ఎఐఎఫ్ టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు అనూసుయ, రాష్ట్ర నాయకురాలు వెంకట లక్ష్మి, కుర్తిలింగం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రములోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయ నందున శనివారం బీడీ కార్మికులు రోడ్డుప్తె ఆందోళన చేశారు. బీడీ కార్మికుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఇప్పటికీ ఎలాంటి షరతులు లేకుండా రూ.4016 జీవన భృతి బీడీ పరిశ్రమలో పనిచేయు, బీడీ కార్మికులకు ప్యాకర్లకు, బట్టి, చటన్ తదితరులకు ఇవ్వాలని అన్నారు. లేనిచో రానున్న స్ధానిక ఎన్నికలలో బీడీ కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రభుత్వం బీడీ పరిశ్రమ ప్తె లేనిపోని ఆంక్షలు కోప్టా చట్టం పెట్టడం, జిఎస్ టి పెట్టడం మూలంగా బీడీ కార్మికులకు చేతినిండా పనిలేదు. నేలలో 10 రోజులు పనిలేదనీ, దీనిద్వారా బీడీ కార్మికులకుటుంభలు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.4016 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర,ప్రధాన కార్యదర్శి, యం, ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు, నగరపు యెల్లయ్య, రాష్ట్ర కోషదికారి స్తెయ్యద్,కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, కుమ్మరి,రవి,,శ్రామిక శక్తి,బీడీ వర్కర్,యూనియన్,రాష్ర్ట నాయకులు, కుర్తి లింగం,బిఎల్ టీయూ జిల్లా నాయకులు,నాంపల్లి,గంగాదర్,శ్రీనివాస్,లక్ష్మి,రాజక్క,తదితరులు పాల్గొన్నారు.