సీవోఈ కళాశాల ఎంట్రెన్స్ ధరఖాస్తులు ఈ నెల 20 వరకు పొడిగింపు

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణా సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభ కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ ధరఖాస్తు తేదీ 15 తో ముగియగా, విద్యార్ధుల తల్లిదండ్రుల అభ్యర్ధన మేరకు 20 తేదీ వరకు టీఎస్   డబ్ల్యుఆర్ఈఐఎస్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ పొడగించారని తెలంగాణా సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయ కర్త కె. అలివేలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష తేదీ 04.ఫిబ్రవరి రోజున ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించబడుతుందని వివరించారు. ఈ సంవత్సరం పరీక్ష ముందుగానే నిర్వహించడం జరుగుచున్నదనీ, గమనించాలనీ కోరారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు www.tswreis.ac.in సందర్శించాలని పేర్కొన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 20 లోపు ధరఖాస్తు చేసుకోవాలని, (TSWRS, TTWREIS, TREIS & MJPBWREIS(‬‎ 2024-25 సంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశం పొందే విద్యార్ధులు, విద్యార్థుల తల్లిదండ్రులు  20.01.2024 లోపు ధరకాస్తు చేసుకోవాలని తెలిపారు.. 5వ తరగతి ప్రవేశ పరీక్ష తేదీ 11ఫిబ్రవరి రోజున ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుందని అలివేలు తెలిపారు.