21న సీడబ్ల్యూసీ భేటీ

న్యూఢిల్లీ: ఈ నెల 21న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది. ఈ నెల 19న ఢిల్లీలో ఇండియా ఫోరం పార్టీల సమావేశమైన రెండు రోజుల తరువాత సీడబ్ల్యూసీ సమావేశాన్ని అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఏర్పాటు చేసినట్లు ఆదివారం ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇండియా ఫోరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతోపాటు, ఇటీవల అసెంబ్లీ ఫలితాలు సీడబ్ల్యూసీ భేటీలో చర్చకు రానున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఫలితాలపై కాంగ్రెస్‌ ఇప్పటి వరకూ చర్చించలేదు. ఈ ఫలితాలపై ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ఇప్పటికే చర్చించారు.