– కుటుంబ సభ్యులకు సైబర్ క్రైమ్స్‌పై వివరించాలి
– నిజామాబాద్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి
నవతెలంగాణ-కంఠేశ్వర్
సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అవగాహన సామాజిక బాధ్యతగా ప్రతి వాళ్లు తీసుకోవాలని ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా సైబర్ క్రైమ్స్ పట్ల వివరించాలని నిజామాబాద్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నరహరి తెలిపారు. ప్రజలకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు నవతెలంగాణకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలియని కాల్స్ లిఫ్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని, ఎవ్వరో తెలియని వ్యక్తి అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్‌కు డబ్బులు పంపొద్దని తెలియజేశారు. తెలియని లింక్స్ క్లిక్ చెయ్యొద్దని, తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు లాభం/నష్టం ఉంది అంటే అస్సలు నమ్మొద్దని, అది సైబర్ నేరగాళ్ల పని అని తెలిపారు. బ్యాంకు పేరుతో వచ్చే కాల్స్ పొరపాటున నమ్మవద్దన్నారు. పిన్, పాస్వర్డ్, ఓటిపి అంటే అకౌంట్ కి గుండె లాంటివి మనకి తప్ప ఇంక్కొక్కరికి చెప్పవాల్సిన అవసరం లేదని అన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఎవ్వరితో చెప్పొద్దు(కస్టమర్ కేర్ అయినా సరే) అని వివరించారు. లోన్ యాప్స్‌లో లోన్ తీసుకుంటే ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ వాళ్ళని ఇబ్బందులు పెడతారని, అప్లికేషన్‌లో కాంటాక్ట్, గేలరీ పర్మిషన్ ఇస్తేనే లోన్ ఇస్తారని, లోన్ కట్టిన కూడా, మీరు లోన్ తీసుకునే ముందు ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ పర్మిషన్ ఇచ్చారని, వారందరిని హరస్ చేస్తారని తెలియజేశారు.
సిబిఐ, ఈడి, ఎన్‌సిబి, ఏసీబీ పేరుతో వచ్చే కాల్స్ అన్ని ఫ్రాడ్ కాల్స్ సిబిఐ/ఈడి/ఎన్‌సిబ/ఏసీబీలో పని చేసే అధికారులు ఎవ్వరికి పోన్ చెయ్యరని అన్నారు. వాట్సాప్ డిపిలో పోలీస్ ఆఫీసర్ పిక్ ఉండి మీకు కాల్స్ వస్తే అవ్వి ఫ్రాడ్ కాల్స్ అని అన్నారు. కొడుకు, కూతురు డ్రగ్స్, రేప్ కేసులో ఇరుక్కున్నారు.. అనగానే భయపడవద్దు అని , ఫోన్ ఆఫ్ చేసి వేరే ఫోన్‌తో మీ కొడుకు /కూతురు కి ఫోన్ చెయ్యండి. డబ్బు గురించి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, తక్కువ ధరకి వచ్చే ఆన్లైన్ ఆఫర్స్ ని, నమ్మవద్దు సైబర్ నేరస్తుల పని అని, ఆన్లైన్ అంటేనే మాయ ప్రపంచంగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. చాలా మంది తెలియని వ్యక్తుల టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవుతున్నారని, అందులో చాలా మందికి డబ్బులు వస్తున్నాయని డ్రా చేస్తున్నట్లు చూపిస్తారని, తెలియక ఇన్స్వెస్ట్ చేస్తున్నారని, మొదట కొంత ఇస్తాడని, లక్షరూపాయలు పెట్టగానే మాయం అవుతాడని అన్నారు. లక్షలు రావాలని అత్యాషకి వెళ్లి ఉన్నవి పోగొట్టుకుంటున్నారని, దయచేసి ఆలా చెయ్యొద్దు(ముఖ్యంగా జాబ్ చేస్తున్న వాళ్ళు) అని తెలిపారు.
సైబర్ క్రైమ్ అవేర్నెస్‌ను సామాజిక బాధ్యతగా తీసుకోవాలి
11:02 pm