నవతెలంగాణ – ఏర్గట్ల
తడపాకల్ గ్రామానికి చెందిన ఓ మహిళకు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి 50 వేలు డిమాండ్ చేశారు.లేదంటే దుబాయ్ లో ఉన్న నీ భర్తను చంపివేస్తామని అనడంతో భయపడి సదరు మహిళ పోలీస్ లను ఆశ్రయించింది.విషయం తెలుసుకున్న భీంగల్ సిఐ నవీన్,ఎస్సై మచ్చెంధర్ రెడ్డిలు ఆమె ఇంటికి వెళ్ళి బాధిత మహిళకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.అనంతరం ఎస్సై మచ్చెంధర్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ళు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల ప్రజలకు ఫోన్లు చేసి వివిధ రకాలుగా భయబ్రాంతులకు గురిచేసి బెదిరిస్తున్నారని,కొన్ని సందర్భాల్లో పోలీస్ ల ఫోటోలు డీపీగా పెట్టుకొని భయపెట్టి డబ్భులు అడుగుతున్నారని,ఇదో రకమైన సైబర్ నేరం అని ఈ విధంగా ఎవరైనా ఫెక్ కాల్ చేసి డబ్భులు అడిగితే ఇవ్వవద్దని,సైబర్ నేరానికి గురైనాము అనిపిస్తే వెంటనే పోలీస్ లను సంప్రదించాలని అన్నారు.ఒక వేళ అనుకోకుండా భయపడి డబ్భులు పంపితే 1930 నంబర్ కు కాల్ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.