మద్నూర్ ఉమ్మడి మండలంలోని డోంగ్లి మండల పరిధిలోని దోతీ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బిచ్కుంద స్వచ్ఛంద సేవా సంస్థ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్మిషన్ ఎస్ ఎస్ టి ఆధ్వర్యంలో ఆర్బిఐ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్యాంకు అందించే సేవలు సైబర్ మోసాలు పైన అవగాహన ఏటీఎం వాడడం వల్ల ఉపయోగాలు డిజిటల్ పేమెంట్ మరియు బీమా పథకాలు పి ఎం ఎస్ బి వై అలాగే పిఎం జేజే బి వై అటల్ పెన్షన్ సుకన్య సమృద్ధి యోజన బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ పై ఫిర్యాదు చేసే విధానం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ పోలీసు సిబ్బంది ఎస్ ఎస్ టి కౌన్సిలర్ ముఖేష్ రవికుమార్ రవీందర్ ధోతి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.