మండలంలో గాలివాన బీభత్సం..

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో మంగళవారం గాలివాన బీభత్సం చేసింది. ఒక్కసారిగా ఈదురు గాలితో పాటు భారీ వర్షం కురవడంతో, రామారెడ్డి- కామారెడ్డి రహదారి లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, షెడ్లు విరిగి పడడంతో రవాణా వ్యవస్థ ఇబ్బందిగా మారింది. ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో చెట్లను తొలగించడంతో, విద్యుత్ అధికారులు విద్యుత్ను పునరుద్ధరించారు.