చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల,రైతు భరోసా రికార్డ్ లను ఆకస్మికంగా పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల జాబితాను తప్పుడు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈనెల 21 నుంచి 24 వ తేది వరకు అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాల జాబితాను గ్రామ సభలలో ప్రదర్శిస్తారని అన్నారు. జాబితాలో నిజమైన లబ్బిదారులకు అవకాశం రాకుంటే అక్కడికక్కడే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మండలంలో 26 గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహిస్తారని అన్నారు.రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్ల పథకాలు నిరంతర పక్రియ.ఈ జాబితాలో పేరు రాకుంటే మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.జిల్లా కలెక్టర్ వెంట చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ అధికారి వి.శేఖర్ రెడ్డి స్థానిక తహశిల్దార్ యస్.హరికృష్ణ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సందీప్ కుమార్ మండల వ్యవసాయ అధికారి నాగరాజు AEO మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.