ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డీఏ, పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీపీయూఎస్ మండల అధ్యక్షుడు సురేష్ అన్నారు. మంగళవారం బొమ్మకల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం సమయంలో నల్ల బ్యాడ్జీ దరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి కలిసి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పీఆర్సీ బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.