దాదా కొత్త ఇన్నింగ్స్‌

Dada new innings– ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో ఫ్రాంచైజీ కొనుగోలు
ఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. గత రెండు సీజన్లుగా దేశంలో మోటార్‌ స్పోర్ట్స్‌ ప్రేమికులను అలరిస్తున్న ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో దాదా ఫ్రాంచైజీ కొనుగోలు చేశాడు. ‘కోల్‌కతా రాయల్‌ టైగర్స్‌’ పేరిట ఫ్రాంచైజీని కొన్న గంగూలీ రాబోయే సీజన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ఈ లీగ్‌లో కోల్‌కతా పాల్గొంటుండటం ఇదే ప్రథమం కాగా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కొచ్చి, అహ్మదాబాద్‌ వంటి ఫ్రాంచైజీలు ఇదివరకే అభిమానులను అలరిస్తున్నాయి. ఈ లీగ్‌లో మూడో ఎడిషన్‌ వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో జరుగనుంది.