అలతి అలతి పదాలతో
కఠినమైన వాక్యాలతో
కొన్నిసార్లు లాలనలు
ఇంకొన్నిసార్లు బోధనలు
చేసే నాన్నంటే….
నడిచే భగవద్గీతే !!
అనుభవాల సారంతో
మూర్తించిన రూపంతో
కొన్నిసార్లు సూచనలు
చాలాసార్లు చైతన్యం
చేసే నాన్నంటే….
నిఖార్సైన యోగివేమనే !!
పోగేసిన విలువలతో
కూడేసిన విజ్ఞతతో
కొన్నిసార్లు ప్రేరేపణ
ఇంకొన్నిసార్లు ఆజ్ఞాపణ
చేసే నాన్నంటే….
నిజమైన శ్రీరాముడే !!
జీవితాన ఆపేక్షతో
మరణమంటె ఉపేక్షతో
కొన్నిసార్లు సంసారనావను
చాలాసార్లు పరమాత్మ తోవను
చూపించే నాన్నంటే….
అసలైన విష్ణుమూర్తే !!
ఓటమిలో ఓరిమితో
విజయంలో ఒడుపుతో
కొన్నిసార్లు తల్లి వలె
చాలాసార్లు గురువు వలె
కనిపించే నాన్నంటే….
అచ్చంగ శ్రీకష్ణుడే !!
సహజ గుణాల సావాసంతో
ప్రత్యేక గుణాల ఆకర్షణతో
కొన్నిసార్లుమామూలువ్యక్తి వలె
చాలాసార్లు తత్వవేత్త వలె
అగుపించే నాన్నంటే….
దిగివచ్చిన పరమశివుడే !!
-మదుల, 7093470828