
మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన డేడ్రా గ్రామస్తులు మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి, గ్రామానికి ప్రధాన రోడ్డు సౌకర్యం గురించి ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే గ్రామంలో పర్యటిస్తానని వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డేడ్రా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.