
లయన్స్ క్లబ్ పెద్దవంగర ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహారం కార్యక్రమాన్ని మండలంలో నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు ఏదునూరి శ్రీనివాస్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ఉచిత అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏదునూరి శ్రీనివాస్-రేణుక దంపతులు తన తండ్రి ఏదునూరి ఆగయ్య జ్ఞాపకార్థం ఉచిత అల్పాహారం పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పూర్వ జిల్లా గవర్నర్ తమ్మెర లక్ష్మీనరసింహారావు, వేలూరి శారద తో కలిసి మాట్లాడుతూ.. సమాజ సేవలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలో నిలుస్తుందని అన్నారు. లయన్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అంగన్ రిలీఫ్ చైర్మన్ దామెర సరేష్, సుంకరనేని నాగవాణి, లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దవంగర కార్యదర్శి ఎర్ర వెంకన్న, కోశాధికారి మొర్రిగాడుదుల శ్రీనివాస్ గౌడ్, కేతిరెడ్డి సోమనర్సింహా రెడ్డి, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, అనపురం రవి గౌడ్, ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, జలగం సతీష్, వెంకటేశ్వర్లు, జలగం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.