విద్యుద్ఘాతంతో పాడి గేదెలు మృతి

Khammam,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ-దమ్మపేట
విద్యుత్‌ ఘాతానికి గురై పాడి గేదెలు మరణించిన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని శ్రీరాపురం గ్రామానికి చెందిన మట్టపర్తి మంగమ్మకు చెందిన రెండు గేదెలు ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాయి. మరణించిన గేదెల విలువ రూ.1.40లక్షలు ఉంటుందని బాధిత మహిళ రైతు వాపోయారు.