విద్యుత్ షాక్ తో పాడి పశువు మృతి

నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్
విద్యుత్ షాకు తో పాడిపశువు మృతి చెందిన సంఘటన మంగళవారం పొట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జొన్నలగడ్డల రాజు పాడి పశువులను మేపుతుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్ విద్యుత్  వైరు తగిలి రూ .60 వెల విలువగల పాడి పశువు మృతి చెందింది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు ఆదుకోవాలని  రైతు రాజు కోరాడు.