పాడి పంటలు బాగా పండాలి

Dairy crops should grow well– ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలి: షేత్కరి గణేష్ మండల్ వ్యవసాయదారుల కోరిక
నవతెలంగాణ – మద్నూర్
శేత్కరి గణేష్ మండల్ అంటే వ్యవసాయదారుల గణేష్ మద్నూర్ మండల కేంద్రంలోని రతం గల్లీలో గల శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో వ్యవసాయదారుల ఆధ్వర్యంలో శెత్కరి గణేష్ మండల్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవాలు వ్యవసాయదారుల ఆధ్వర్యంలో 1976 నుండి ప్రారంభం అయింది. ఈ గణేష్ మండల్ పక్కా వ్యవసాయదారులదే ఈ గల్లి ప్రాంతంలో అత్యధికంగా వ్యవసాయదారులు ఉన్నారు. షేత్కరి అంటే హిందీలో గాని మరాఠీ లో గాని వ్యవసాయదారులు అన్నమాట. వ్యవసాయదారుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతారు. ప్రతిరోజు ఉదయం ాత్రి రెండు పూటలు గణేష్ మండపంలో వ్యవసాయదారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారు కోరుకునేది ఏమిటంటే, పాడి పంటలు బాగా పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నారు. మద్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయదారుల గణేష్ మండలి అంటేనే గ్రామస్తులు గొప్ప గణపతిగా పేరు పొందుతూ వస్తుంది. వ్యవసాయదారులు గణేష్ ఉత్సవాల కోసం తమ తమ పిల్లల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిపిస్తున్నారు.