డైరీ క్షేత్ర పరిశీలన

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని అమ్రాద్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అధ్వర్యంలో పాల ఉత్పత్తుల పై అవగాహన సదస్సులో భాగంగా మంగళవారం క్షేత్ర స్థాయి పరిశీలన ఓడ్యాట్ పల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు కిరణ్ డేశ్ పాండే పాల్గొని రైతులకు గేదెల గురించి, రైతులు నడుపుతున్న విధానం గురించి వివరించారు. ఆవులను ఎలా పెంచుతున్నారు, రైతుల యొక్క అనుభవాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఆర్ఎస్ఇటిఐ కే. రామకృష్ణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.