దళిత ఆత్మబంధువు కేసీఆర్‌

నవతెలంగాణ-ఆత్మకూరుఎస్‌
వందల ఏండ్లుగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అణిచివేయబడ్డ దళితుల వెనకబాటుతనాన్ని తొలగించాలని ఎంతో మేధోమధనంతో ఆలోచించి దళితుల ఆర్థిక స్వాలంబనకు దళితబంధు పథకం ప్రవేశపెట్టిన దళితుల ఆత్మబంధువు కేసీఆర్‌ అని సీనియర్‌ న్యాయవాది దళిత నాయకులు తల్లమల్ల హసేన్‌ అన్నారు.మంగళవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్లజగదీశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ మండలంంలోని ఏపూరు, తుమ్మలపెన్‌పహాడ్‌, కోటపహాడ్‌ గ్రామాలలో, గ్రామాలలోని దళిత వాడలలో దళిత న్యాయవాదులు, దళిత నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తల్లమల్ల హసేన్‌, బిఆర్‌ఎస్‌ న్యాయవిభాగం నాయకులు జిలకర చంద్రమౌళి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా దళితుల అభివద్ధి సంక్షేమం గురించి దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షలిస్తున్నారని తెలిపారు. ఈ పథకం మహాద్భుతమైనదన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో , అనుములపూరి సైదులు, చిప్పలపల్లి చిరంజీవి, మీసాల శ్రీనివాస్‌, దళిత నాయకులు గోలి సాంబయ్య, దాసరి దేవయ్య, గాజుల నర్సయ్య, ఏపూర్‌ సర్పంచ్‌ సానబోయిన రజిత సుధాకర్‌, వార్డుసభ్యులు పోకల మధుసూధన్‌, జ్యోతి,బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు బషీర్‌, రాములు,కొమరయ్య, నాగయ్య, పాల్గొన్నారు.