నవతెలంగాణ – భీంగల్
మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పర్సన్ నవీన్ పై చేయి చేసుకున్న భీంగల్ ఎస్సై హరిబాబు పై చర్యలు తీసుకోవాలని భీంగల్ దళిత ఐక్య సంఘటన నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన బంధువుల కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పర్సన్ నవీన్ పై చేయి చేసుకోవడంతో పాటు నాన మాటలతో దుర్భసలాడిన ఎస్సై హరిబాబుపై అట్రాసిటీ కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత ఐక్య సంఘటన నాయకులు కాంతయ్య, ప్రసాద్, పర్స నవీన్, గంగారం, రమేష్, రాజేందర్ మరి సంఘం సభ్యులు ఉన్నారు.