దళితబంధు పథకం స్ఫూర్తిదాయకం

– విప్లవాత్మక కార్యక్రమాలతో ప్రపంచానికి కేసీఆర్‌ ఆదర్శం
– కేసీఆర్‌కు కృతజ్ఞత సభలో బ్రిటన్‌ ఎంపీలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉందని పలువురు బ్రిటన్‌ ఎంపీలు ప్రశంసించారు. ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాలతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. బ్రిటన్‌కు చెందిన అంబేద్కర్‌ యూకే సంస్థ, ప్రవాస భారతీయ సంస్థల ఆధ్వర్యంలో సోమవారం అక్కడి పార్లమెంట్‌ కమిటీ హాల్‌లో కేసీఆర్‌కు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకే ఎంపీలు వీరేంద్ర శర్మ , నవేదు మిశ్ర, బారోన్‌ కుల్దీప్‌ సింగ్‌ సహౌట, ఇంకా పలువురు స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. బ్రిటన్‌లో నివసిస్తున్న పలువురు ప్రముఖ ఎన్నారైలతో పాటు, స్థానిక ప్రవాస సంఘాల నాయకులు, తెలంగాణ ఎఫ్‌డిసీ చైర్మన్‌ అనిల్‌ కూర్మాచలం తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ దళితుల పట్ల వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవితాంతం పోరాటం చేసిన సంఘసంస్కర్త అనీ, అలాంటి మహనీయుడి భారీ విగ్రహాన్ని హైదరా బాద్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా దళిత బంధు పథకాన్ని కేసీఆర్‌ తెచ్చారంటూ అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలతో దళితులు ఆర్థికంగా బలపడటమే కాకుండా వారిపట్ల సామాజిక వివక్ష, అసమానతలు తొలగిపోతాయని వారు అభిప్రాయ పడ్డారు. బ్రిటన్‌లోని ఎన్నారై సంఘాల నేతలు మాట్లాడుతూ తెలంగాణ స్పూర్తితో భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని దళితుల సంక్షేమం పట్ల ఆయా ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనిల్‌ కూర్మాచలం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తీసుకునే ప్రతి నిర్ణయం చారిత్రాత్మక మనీ, ప్రపంచవ్యాప్తంగా వాటిపై చర్చ జరుగుతు న్నదని తెలిపారు. దళిత బంధు విజయాలను వివరించారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ దళిత బంధు ద్వారా ఎన్నో దళిత కుటుంబాల్లో సీఎం వెలుగు నింపారని తెలిపారు. దళిత్‌ యూకే నెట్‌ వర్క్‌ డైరెక్టర్‌ గజాల షేఖ్‌, అంబే ద్కర్‌ యూకే సంస్థ ప్రతి నిధి సుశాంత్‌ ఇంద్రజిత్‌ సింగ్‌, ఎన్నారై బీఆర్‌ ఎస్‌ యూకే అధ్యక్షు లు అశోక్‌ గౌడ్‌ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్‌ రెడ్డి, టాక్‌ అధ్యక్షులు రత్నాకర్‌ కడుదుల, టీడీఎఫ్‌ చైర్మెన్‌ కమల్‌ ఓరుగంటి, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్‌ ఖాజా, ఉదరు ఆరేటి, కన్సర్వేటివ్‌ నాయకుడు హరి, లోకమాన్య తదితరులు పాల్గొన్నారు.