చేపల పెంపకానికి దళితులు ముందుకు రావాలి

Dalits should come forward for fish farming– సబ్సిడీలు పొంది అభివృద్ధి చెందాలి: అవగాహన సదస్సులో అధికారులు

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం చేపల పెంపకానికి అందించే సబ్సిడీలను సద్వినియోగం పరుచుకొని అభివృద్ధి చెందాలని అధికారులు దళితులకు సూచించారు బుధవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో చేపల పెంపకంపై దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం తో పాటు దళితులకు చేపల పెంపకం పై అవగాహన కల్పించారు. ఒక యూనిట్ 4:30 లక్షలు ఉంటుందని వీటిలో రెండు లక్షల 75 వేల రూపాయలు సబ్సిడీ పోను మిగిలిన 1,75 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తుందని దీనిని దళితులు ముందుకు వచ్చి సద్వినియోగం పంచుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ లీడ్ బ్యాంకు మేనేజర్ మద్నూర్ ఎంపీడీవో రాణి ఐకెపి డిపిఎం రమేష్ మద్నూర్ ఎన్డీసీసీ బ్యాంక్ మేనేజర్ సాయిలు మద్నూర్ ఐకెపి ఎపిఎం మనోహర్ ఇతర అధికారులు ఐకెపి సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరైన దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.