తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనావేసి పరిహారం చెల్లించాలి..

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం. 
నవతెలంగాణ- మునుగోడు
మిగ్‌జాం తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో అనేక జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని . రైతులు తీవ్రంగా నష్టపోయారని . పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణం రైతాంగానికి పరిహారం అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వానికోరారు.గురువారం మునుగోడు మండల కేంద్రంలో సిపియం మునుగోడు నియోజకవర్గ స్థాయిసమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి, చండూరు,మునుగోడు మండలాల బాధ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకేసారి 18 సెంటిమీటర్లకు పైగా వర్షం కురవడంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని,ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు తీవ్రంగా నష్టపోయారని.వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని అనేక మండలాల్లో టమాట, వంగ, బీర, బెండ తోటలు కూడా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదకు గురౌతున్నారనిఆయన అన్నారు. . కల్లాల్లో ఉన్న వరి తడిసిపోవడంతో మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడిందిని . అదే విధంగా కల్లాల్లో     ఉన్న మిర్చి కూడా తడిసి తీవ్రంగా నష్టం వాటిల్లిందిని వారు అన్నారు.. కోత దశలో ఉన్న వరి పంట కూడా నేలరాలి దెబ్బతిన్నది. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ.20,000, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.40,000లు చెల్లించాలిని వారు ప్రభుత్వాన్ని కోరారు.. వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సిపిఎం మండల కార్యదర్శి మిర్యాల భరత్,,  సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, మునుగోడు మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు,మునుగోడు మండల కమిటీ సభ్యులువేముల లింగస్వామి,యాస రాణి శ్రీను,సాగర్ల మల్లేష్,సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు.