
దుబాయ్ లో జరిగే సంక్రాంతి సంబరంలో భాగంగా పట్టణంలో గల నటరాజ నృత్యానికేతన్ గురువు డాక్టర్ బాశెట్టి మృణాళిని కి దుబాయ్ లో గల తెలుగు అసోసియేషన్ నుంచి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానం రావడం జరిగింది. అందుకుగాను ఈనెల 11వ తారీఖున డాక్టర్ బాశెట్టి మృణాళిని దుబాయ్ బయలుదేరుతున్నట్టు నటరాజు నిత్య నికేతన్ వ్యవస్థాపకులు మాడవేగడి నారాయణ గురువారం తెలిపారు. దుబాయ్ కి ఆహ్వానం రావడం పట్ల సన్నిహితులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తపరిచారు.