దంచి కొట్టిన వాన.. ఏజెన్సీ అతలాకుతులం..

– పొంగి పొర్లిన వాగులు, కుంటలు 
– బంధాల రైతుల 14 మేకలు మృతి
– వేల ఎకరాలు భూమి నష్టం.. 
– ఆదుకోవాలని ఆదివాసి రైతులు వేడుకలు 
నవతెలంగాణ – తాడ్వాయి 
ఏజెన్సీలో విస్తారంగా కురిసిన వర్షాలకు తాడ్వాయి మండలంలో వాగులు, గొర్రెలు, చెరువులు ఉగ్రరూపం దాల్చాయి. చింతల్ క్రాస్ వద్ద జంపన్న వాగు, కొంగల మడుగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఎల్బాక, పడిగాపూర్ గ్రామాలు ఐదు రోజుల నుండి జలదిగ్బంధంలో ఉండిపోయాయి. బంధాల ఏజెన్సీలో నాలి నర్సయ్య 6 మేకలు, నాలి నడిపి నరసయ్య 8 మేకలు మొత్తం సుమారు లక్ష యాభై వేల విలువచేసే 14  మేకలు మృతి చెందాయి. వేల ఎకరాల పొలాలు నీట మునిగి మునిగిపోయాయి. ప్రభుత్వం, కారులు వెంటనే స్పందించి సర్వే నిర్వహించి భూములు పశువులు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.