
దేశవ్యాప్త కార్మిక కర్షక సమ్మె గ్రామీణ బంధు లో భాగంగా ఆత్మకూర్ ఎస్ మండల లో కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా శుక్రవారం బందు నిర్వహించారు. ఆత్మకూరు ఎస్ గ్రామంలో గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్, ఎమ్మార్వో ఆఫీస్, ఎంపిడిఓ కార్యాలయం బంద్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అవిరే అప్పయ్య, మండల నాయకులు, సోమిరెడ్డి దామోదర్ రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు చక్రయ్య దశరథ ,యాతాకుల వెంకన్న, డేగల వెంకటకృష్ణ, విజయ రెడ్డి, అబ్బగాని బిక్షం, గంపల ఎల్లయ్య పాల్గొన్నారు. దేశవ్యాప్త కార్మిక కర్షక సమ్మెలో భాగంగా మండలంలోని ఏపూర్ గ్రామంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బందు నిర్వహించడం జరిగింది. తాము ఆటోలు నడుపుతూ జీవిస్తున్నామని తమ జీవనాధారంను దెబ్బతీయొద్దని ఉచిత బస్సులను రద్దు చేయాలని ఆటో డ్రైవర్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వినయ్, ఉపాధ్యక్షుడు పరికపెల్లి రమేష్, బిక్షపతి , రమేష్ కృష్ణ , గణేష్ ,వంశీ ,మధుసూదన్ నిమ్మల శీను, ఉపేందర్, వీరయ్య మల్లేష్ ,అల్లావుద్దీన్ ,సుభాష్, పాల్గొన్నారు.