– సీఎంపై మాజీమంత్రి టీ హరీశ్‌రావు విమర్శలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహబూబ్‌నగర్ రైతుపండుగలో సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆడంబరంగా నిర్వహించిన ఈ కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందన్నారు. ఏడాది పూర్తయినా ఇప్పటికీ రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలిపి ఎకరాకు రూ.15వేలు ప్రకటిస్తారనుకుంటే మొండి చెయ్యి చూపారని విమర్శించారు. కౌలు రైతులు, ఉపాధి కూలీలకు ఇచ్చిన హామీలకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం రైతుల పట్ల ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామనే ఆవేదనే ఎక్కువగా కనిపించిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా 2014కు ముందు ఉన్న ప్రాజెక్టులు, ఆ తర్వాత పెరిగిన ఆయకట్టు వివరాలను ఆ ప్రకటనలో వివరించారు.